హైదరాబాద్ పుస్తక ప్రియులకి గుడ్‌న్యూస్
‘పుస్తకం హస్తభూషణం’ అన్నారు పెద్దలు. ఎంతగా సాంకేతికత కొత్తపుంతలు తొక్కినా పుస్తకం చేతితో పట్టుకుని చదువుకుంటే ఆ సంతృప్తే వేరు. మొబైల్‌లో, కంప్యూటర్ స్క్రీన్‌పై చదువుకుంటే ఆ ఆనందం రాదు. ఈ విషయం పుస్తకాన్ని ప్రేమించే వ్యక్తులకు అనుభవమే. ఇప్పుడు లైబ్రరీల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది.అందుకే ఎక్కడైనా బుక్ ఫెయిర్‌లు జరిగితే అక్కడికి ఎంత దూరమైనా పరిగెడతారు. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలోనే పెద్ద బుక్ ఫెయిర్ జరగబోతోంది. మార్చి 25 నుండి ఏప్రిల్ 2 వరకు ఏన్యువల్ బుక్ ఫెయిర్ తొమ్మిదిరోజులపాటు ప్రిమా మాల్ దగ్గరలో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద జరుగుతుంది. దీనిని ‘కితాబ్ లవర్స్’ అనే న్యూఢిల్లికి చెందిన స్టార్టప్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. దీనికి ప్రవేశ రుసుము కూడా లేదు. దీనిలో 10 లక్షలకు పైగా రకరకాల సాహిత్యాలకు, పేరుపొందిన రైటర్స్‌కు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. రొమాన్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, క్రైమ్, ఫాంటసీ మొదలైన 20 రకాల జోనర్లకు చెందిన పుస్తకాలు ఉంటాయి. వీటిని మూడు రకాల ప్యాకింగులలో వరుసగా 1,199రూపాయలు, 1799 రూపాయలు, 2,999 రూపాయలకు బాక్స్‌లలో అందుబాటులో ఉంటాయి.