Home Page SliderNational

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఈ నెల 1వ తేది నుంచి రాష్ట్రంలో పాత పెన్షెన్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. గత ఏడాదిలో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి సుఖ్విందర్ సింగ్ సుఖు  OPS విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తూ సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 1.36 లక్షలమంది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల నుంచే పాత పెన్షెన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందనున్నారు. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.