గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికా
మీరు అమెరికాలో ఉంటూ..గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారా?అయితే మీకో శుభవార్త. కాగా ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అదేంటంటే నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీకి చెందిన పలువురికి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. అయితే గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ కూడా 5 ఏళ్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికాలో నివసిస్తున్న వేలమందికి లబ్ది చేకూరనుంది. ఈ నిర్ణయం పట్ల అమెరికాలో నివశిస్తున్న వేలాదిమంది ఇతర దేశస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

