‘బంగారం ప్రియులకు శుభవార్త’..గ్రాము రెండువేలకే..
బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్రప్రభుత్వం. బంగారం ధరలో హెచ్చుతగ్గులు మామూలే. కానీ భారత్‌లో బంగారం ధర కొంచెం తగ్గిందంటే చాలు. డిమాండ్ అమాంతం పెరిగిపోయి మళ్లీ ధరలు ఆకాశానికి ఎగబాకుతాయి. ఈ మధ్యకాలంలో బడ్జెట్‌లో బంగారంపై ట్యాక్స్ తగ్గించడంతో పది గ్రాములకు వెయ్యిరూపాయల పైనే ధర తగ్గింది. అయితే డిమాండ్ పెరిగి మళ్లీ ధరలు యధాస్థానానికి వచ్చాయి. బంగారం ధరలు ప్రస్తుతం 10 గ్రాములకు రూ.70 వేలదాకా ఉంది. దీనితో చైన్ స్నాచర్స్ కూడా ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భయపడకుండా బంగారం వేసుకుని రోడ్లపై తిరిగే రోజులు రావాలని మహిళలు ఆశించడం సహజమే. అందుకోసం 22 కేరట్ల బదులుగా 9 కేరట్ల బంగారాన్ని వాడుకలో తీసుకొచ్చే అవకాశంపై ఆలోచిస్తోంది కేంద్రప్రభుత్వం. ఇది జరిగితే ధరలు గ్రాముకి రెండువేల నుండి మూడువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. దీనితో పది గ్రాములు రూ. 20 వేల రూపాయలు మాత్రమే. ఈ బంగారంపై కూడా హాల్‌మార్క్ ముద్రించి, నాణ్యతపై భరోసాను కల్పిస్తారట.

