Breaking NewsHome Page Sliderhome page sliderNational

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం బంగారం ధరలు భారీగానే దిగివస్తున్నాయి. రాబోయే మూడు నెలల పాటు ధరలు మరింత తగ్గుతాయని అంచనా. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీపావళి తర్వాత నుండి బంగారం ప్రతిరోజూ కనీసం పది గ్రాములకు వెయ్యి రూపాయల చొప్పున తగ్గుతోంది. ఒక్క వారంలోనే దాదాపు రూ.9 వేలు తగ్గింది. బంగారం కొనాలంటే ఇదే మంచి తరుణం అనీ, కొనుక్కోవాలని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సురక్షితమైన పెట్టుబడిగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. రికార్డు గరిష్టాలను తాకిన బంగారంపై పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం, రిస్క్ ఆస్తులైన ఈక్విటీల వైపు తిరిగి రావడంతో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గుతోంది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ట్రంప్ – షీ జిన్‌పింగ్ సమావేశం ద్వారా అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు తగ్గితే బంగారం ధరలు తగ్గొచ్చు. బ్లూమ్ బర్గ్ రిపోర్టు ప్రకారం.. బంగారం ఈటీఎఫ్ ల నుంచి భారీగా ఫండ్స్ విత్ డ్రా జరుగుతోంది. ప్రస్తుతం కానీ అకస్మాత్తుగా బంగారం 11 వేలు తగ్గింది. బంగారం 1.32 లక్షల నుండి 1.21 లక్షలకు పడిపోయింది. ఈ తగ్గుదల కొనసాగుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది జరిగితే బంగారం లక్ష కంటే తక్కువకు పడిపోతుందని, పెద్ద తగ్గింపు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.