బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్
ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. కాగా ఈ రోజు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 తగ్గి రూ.72,380గా ఉంది. కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 తగ్గి రూ.66,350కి చేరింది. మరోవైపు కేజీ వెండి ధర కూడా రూ.2000 వరకు తగ్గి రూ.92,000గా నమోదైంది. కాగా తగ్గిన ఈ ధరలే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి.

