Home Page SliderNational

రైతులకు శుభవార్త

రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పీఎం కిసాన్ నిధులు రీలీజ్ అయ్యాయి. మహారాష్ట్ర పర్యటలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ ఇవాళ (అక్టోబర్ 5) రిలీజ్ చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) పద్ధతిలో మొత్తం రూ. 20,000 కోట్ల ఫండ్స్ ను మోదీ రిలీజ్ చేశారు. తద్వారా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరునుంది. 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. 732 కృషి విజ్ఞాన్ కేంద్రాలు, ఒక లక్ష వ్యవసాయ సాగు కోఆపరేటివ్ సొసైటీలు, ఐదు లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల వెబ్ క్యాస్ట్ ల ద్వారా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.