మందుబాబులకు గుడ్‌న్యూస్-డెలివరీ యాప్‌లో మద్యం హోం డెలివరీ
మందుబాబులకు గుడ్‌న్యూస్. జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో త్వరలో మద్యం హోం డెలివరీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బీర్, వైన్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ ఉండే డ్రింక్స్‌ను హోం డెలివరీ చేస్తామని ఈ యాప్‌లు ప్రకటించాయి. మహానగరాలలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ వంటి సమస్యల కారణంగా మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేయలేని వారికోసం మద్యాన్ని ఇంటికే సరఫరా చేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికోసం వయస్సు ధ్రువీకరణ తప్పనిసరని తెలియజేశారు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు, టైమింగ్స్ వంటి నియమాలు ఉంటాయి. గతంలో కొవిడ్ కాలంలో మహారాష్ట్ర, జార్ఘండ్, అస్సాంలలో ఇలాంటి డెలివరీకి తాత్కాలికంగా ప్రభుత్వాలు అనుమతించాయి. పైలట్ ప్రాజెక్టుగా మొదట దిల్లీ, హర్యానా, తమిళనాడు, గోవా, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో దీనిని అమలుచేస్తామని, అనంతరం ఇతర రాష్ట్రాలలో డెలివరీకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్, ఒడిశాలలో మద్యం హోమ్ డెలివరీకి అనుమతి ఉంది. దీనివల్ల ఆన్‌లైన్ డెలివరీలు 30 శాతం వరకూ పెరిగాయని రిటైల్ పరిశ్రమల అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో మద్యం హోం డెలివరీల ద్వారా వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తామని, దీనిద్వారా ఆర్థిక వృద్ధి పెరుగుతుందని పేర్కొన్నారు.
