Home Page SliderInternational

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్…ఇకపై ఒలింపిక్స్‌లో క్రికెట్

చాలాకాలంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఒలింపిక్స్ కమిటీ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వారు డిమాండ్ చేస్తున్న క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028 జరగబోయే ఒలింపిక్స్‌లో టీ 20 క్రికెట్ టోర్నీకి చోటు దక్కింది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో ఒలింపిక్స్ జరుగనున్నాయి. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ వంటి క్రీడలకు కూడా చోటు దక్కింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ట్వీట్ చేసింది.