Home Page SliderInternational

కాఫీ త్రాగేవారికి గుడ్ న్యూస్

నిత్యం 3 కప్పుల కాఫీ త్రాగే వారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు సగానికి తగ్గుతుందని.. కాఫీలలో ఉండే కెఫైన్ దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది మధుమేహం, పక్షవాతం వంటి జబ్బులను దూరం పెడుతుందంటున్నారు చైనా సైంటిస్టులు. ఈ మేరకు వారు లక్షలాది మంది వాలంటీర్ల ఆరోగ్య వివరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నారట. రోజుకు 3 కప్పుల కాఫీతో 200 నుంచి 300 మిల్లీ గ్రాముల కెఫెన్ మన శరీరంలోకి చేరుతుందని, ఇదే హృద్రోగాలను దూరం పెడుతుందని చైనాలోని సుషౌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. కాఫీ మాత్రమే కాదు కెఫైన్ ఉండే చాక్లెట్లు, ఎనర్జీ డ్రింకులు, స్నాక్ బార్స్.. ఇలా ఏవైనా సరే కానీ రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫైన్ శరీరంలోకి చేరితే సరిపోతుందని చెబుతున్నారు.

కాఫీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒక కప్పు కాఫీలో 1000 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బరువు తగ్గడానికి లేదా బరువు పెరగకుండా నిరోధించడానికి కాఫీ మీకు సహాయపడుతుంది. కెఫైన్ జీవ క్రియను పెంచుతుంది. కాఫీ త్రాగిన తర్వాత ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని అధ్యయనంలో తేలింది. కాఫీ త్రాగేవారికి ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.