కెనరా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన కస్టమర్లకి గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 1 నుండి కొన్నిరకాల ఖాతాలకు కనీస సగటు నెలవారీ నిల్వపై జరిమానాను రద్దు చేస్తామని ప్రకటించింది. వాటిలో పొదుపు ఖాతాలు, జీతం ఖాతాలు, ఎన్నారై (NRI) పొదుపు ఖాతాలు మరియు ఇతరత్రా అన్ని పొదుపు బ్యాంకు ఖాతా రకాలలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) అవసరాన్ని పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యల వల్ల జూన్ 1, 2025 నుండి అన్ని పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్ తప్పనిసరి కాదని, దానిని నిర్వహించనందుకు ఎటువంటి జరిమానా విధించబడదని పేర్కొంది.