అటల్ పెన్షన్ లబ్దిదారులకు గుడ్‌న్యూస్
అటల్ పెన్షన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుంది. వీరికి ఇచ్చే రూ.5000 పెన్షన్‌ను రూ.10,000లకు పెంచే ఆలోచన చేస్తోంది. 60 సంవత్సరాలు దాటిన పేద వృద్ధులకు, ఏ పెన్షన్ ఆధారం లేనివారి కోసం ఈ పెన్షన్ స్కీమ్ 2015లో ప్రవేశపెట్టింది కేంద్రం. వారు పొదుపు చేసే మొత్తం ఆధారంగా రూ.1000 నుండి రూ.5000 వరకూ ప్రస్తుతం లభిస్తోంది. దీనిపై కొత్త ప్రతిపాదన ఓకే అయితే ఈ బడ్జెట్‌లో దీనిని ప్రవేశపెడతారు. దీనివల్ల కేంద్రంపై ఎంత భారం పడుతుందో అంచనాలు వేస్తున్నారు.