Home Page SliderNationalNews Alert

యాపిల్‌ యూజర్లకు శుభవార్త

యాపిల్‌ కంపెనీ తాజాగా భారత ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 5జీతో కూడి ఐఓఎస్‌ అప్‌డేట్‌ను రిలీజ్‌ చేసింది. ఇండియాలో ఐఓఎస్‌ 16.2 (iOS16.2) పేరిట యూపిల్‌ ఈ అప్‌డేట్‌ను అందించింది. దీంతో ఆ కంపెనీ లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ 14 సహా ఇతర ఐఫోన్‌ యూజర్లు  అప్‌డేట్‌ ద్వారా ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌ 5జీ సేవలను పొందొచ్చు. 5జీ నెట్‌వర్క్‌తోపాటు యాపిల్‌ మ్యూజిక్‌, ఐక్లౌడ్‌ డేటాకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌, హోమ్‌ యాప్‌కు సంబంధించిన పలు మార్పులను చేపట్టింది. సెట్టింగ్స్‌లోకి వెళ్ళి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఈ సదుపాయాలను పొందొచ్చు. ఒకవేళ మీరుంటున్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంటే… నేటి నుంచే ఈ సేవలను ఆనందించవచ్చు.