Andhra PradeshHome Page Slider

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ఏపీ ప్రభుత్వం సచివాలయ,హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.కాగా రాష్ట్రంలోని సచివాలయ,హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు  ఇప్పటివరకు 16 శాతంగా ఉన్న ఇంటి అద్దె భత్యాన్ని 24 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే దీనిని రూ.25,000/- మించకుండా వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం  నిర్ణయించినట్లు తెలుస్తోంది.