ఏపీ రైతులకు గుడ్‌న్యూస్
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాయలసీమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాధారణం కంటే గత సంవత్సరం సాగు దిగుబడి తగ్గినట్లు గమనించారు. దీనికోసం 8 జిల్లాల రైతులకు 69 వేల క్వింటాళ్ల విత్తనాలు 80 శాతం డిస్కౌంట్‌తో అందించాలని నిర్ణయించింది. సాధారణంగా 37 లక్షల ఎకరాలలో సాగు వేస్తే వాటిలో 15 లక్షల ఎకరాలలో సాగు దిగుబడి గణనీయంగా తగ్గింది. దీనితో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఉలవలు, పెసర, అలసందలు, జొన్నలు, మినుములు, కొర్రలు, సజ్జలు వంటి ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం రూ.65 కోట్లు ఖర్చును అంచనా వేశారు.

