ఏపీలో టెన్త్,ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఏపీ సర్కార్ ఈ ఏడాది 10వ తరగతి,ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది.కాగా ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు ,కాలేజీల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. నియాజక వర్గ స్థాయిలో టెన్త్,ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన టాప్ -3లో ఉన్నవారికి ఈ నెల 23న పతకం,సర్టిఫికెట్‌తో సన్మానిస్తామన్నారు. కాగా జిల్లా స్థాయిలో టాప్-3 సాధించిన వారికి ఈ నెల 27న రూ.50 వేలు,రూ.30వేలు,రూ.10 వేలు ఇస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో టాప్-3 సాధించినవారికి ఈ నెల 31న రూ.లక్ష,రూ75 వేలు,రూ.50 వేలు అందజేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీంతో ఏపీలోని విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.