అమెరికన్లకు గుడ్‌న్యూస్..భారతీయులకు బ్యాడ్‌న్యూస్
నూతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకెట్ స్పీడ్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తాజా నిర్ణయాలలో అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను రద్దు అంశం వారికి శుభవార్తగా మారింది. అదే సమయంలో భారత, చైనాలపై దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఇది ఆ దేశాలకు బ్యాడ్‌న్యూస్‌గా మారింది. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి, ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ నుండి వచ్చే ఆదాయం భారీ స్థాయిలో ఉంది. ట్రంప్ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రమాదం ఉంది. దానిని భర్తీ చేసుకోవాలంటే దిగుమతి సుంకాలు పెంచాలన్నది ట్రంప్ ప్రణాళిక. దీనికోసం భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై దిగుమతి సుంకాల పోటు తప్పదన్నారు. చైనా భారీగా పన్నులు వసూలు చేస్తోందని, అమెరికా కూడా అదే దారిలో సుంకాలు వసూలు చేస్తే అమెరికన్లు సంపన్నులవుతారని పేర్కొన్నారు.