పండుగ వేళ శుభవార్త
కొద్ది రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా తాజాగా పండుగ వేళ పసిడి రేటు భారీగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయ వాడలో నిన్నటి ధరలతో పోల్చుకుంటే ఇవాళ 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.70,300గా ఉంది. అలాగే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690గా ఉంది. ఇక కిలో వెండి ధర ఏకంగా రూ.2,000 తగ్గి రూ.1,00,000గా ఉంది.

