“మనకు మళ్లీ మంచి రోజులు వస్తాయి”:జగన్
ఏపీ మాజీ సీఎం జగన్ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొందరు వైసీపీ శ్రేణులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జగన్ వారితో మాట్లాడుతూ..మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయి.కాబట్టి ఎవరు భయపడొద్దని ఆయన వారికి ధైర్యం చెప్పారు. కాగా తాను మళ్లీ ప్రజల్లోకి వస్తానన్నారు. ప్రజలందరికీ అండగా ఉంటామని జగన్ తెలిపారు. రాబోయే రోజలు మనవే అని జగన్ భరోసా ఇచ్చారు. అయితే పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు రూ.100కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉన్నట్లు కొందరు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జగన్ ఈ విషయాన్ని తనకెందుకు ఇప్పటివరకు చెప్పలేదంటూ తన సన్నిహితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

