బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకానికి ఆహ్వానం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ పండితులు,నిర్వాహకులు ఆహ్వానించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య , దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ లతో పాటు ఆలయ ఈవో, అర్చకులు, జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిని విన్నవించారు. ఈ నెల 23 న నిర్వహించే స్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా సీఎంకి అందించారు.కార్యక్రమంలో భాగంగా సీఎంని శాలువాతో సత్కరించారు.స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

