అమెజాన్ లో గోల్డ్ వోచర్స్
ఫెస్టివల్ గిఫ్టింగ్ కోసం గోల్డ్ వోచర్స్ అందుబాటులోకి తెచ్చామని ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది. ఫిన్ టెక్ కంపెనీ పైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని జారీ చేస్తుంది. “అమెజాన్ గోల్డ్ వోచర్ విలక్షణమైన ప్రీపెయిడ్ డాక్యుమెంట్. వీటితో అమెజాన్ నుంచి కల్యాణ్, ఎంటీసీ, తనిష్క్, జోయాలుక్కాస్ వంటి బ్రాండ్ల నగలను, కాయిన్స్ ను కొనుక్కోవచ్చు. ఈ వోచర్స్ టియర్ 2. టియర్ 3 పట్టణాలు సహా భారతదే శంలోని ఏడు వేల పిన్ కోడ్ లలో లభ్యమవుతాయని సంస్థ పేర్కొంది.