సామాన్యులకు అందని బంగారం
రోజురోజుకీ పెరుగుతున్న బంగారు, వెండి ధరలు సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఈ రోజు బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 53,550 రూపాయలకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం 58,420 రూపాయలకు చేరింది. వెండి కూడా కేజీకి 200 పెరిగింది. వెండి ప్రస్తుత ధర 72,700 రూపాయలుగా ఉంది.. రాబోయే రోజులలో పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.


 
							 
							