Home Page SliderNational

మరోసారి పెరిగిన బంగారం ధరలు

కేంద్రం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో బంగారంపై టాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. అయితే గత రెడు రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160/- పెరిగి రూ,69,160/-కి చేరింది. కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150/- పెరిగి రూ.63,400/-గా ఉంది. మరోవైపు కేజీ వెండిపై రూ.500/- పెరగడంతో మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.85,000/-గా నమోదైంది.