హైదరాబాద్‌లో బంగారం ధరలు కుప్పకూలాయి
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,380 తగ్గి ₹1,27,200కు చేరింది. అదే 22 క్యారెట్ల పసిడికి రూ.3,100 తగ్గుదల నమోదై, కొత్త రేటు ₹1,16,600గా ఉంది.
ట్రేడ్ వర్గాల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) ధర $245 మేర పడిపోవడం ఈ పతనానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఇక వెండి కూడా వెనుకంజ వేసింది. కిలో వెండి ధర రూ.2,000 తగ్గి ₹1,80,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.