భారీగా తగ్గిన బంగారం ధరలు..
బంగారం ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజుల నుండి బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. సరికొత్త రికార్డులతో సామాన్యులకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. ఇప్పటికే రూ.80 వేల మార్కును బంగారం దాటేసింది. వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు బంగారం ధరలు తులం 770 రూపాయలు తగ్గింది. హైదరాబాదులో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 80,560గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.700 తగ్గి 73,850గా నమోదైంది.