దేశంలో గరిష్టానికి చేరిన బంగారం ధర
భారత్‌లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు అనేక నగరాలలో గరిష్టానికి చేరింది బంగారం ధర. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.330 పెరిగి రూ. 82,420కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.300 పెరిగి రూ.75,550కి చేరింది. గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు కూడా రూ.1000 పెరిగాయి. దీనితో కేజీ వెండి ధరలు రూ.1 లక్షా 5 వేలకు చేరింది.