ఖర్జూరంలో బంగారం.. పట్టుబడిన కేటుగాడు
ఖర్జూర పండ్ల ముసుగులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న కేటుగాడు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగింది. ఇవాళ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో గోల్డ్ బయటపడింది. బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఖర్జూరం పండ్లలో మిక్స్ చేసి తరలిస్తుండగా మెటల్ డిటెక్టర్ తో చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి సుమారు 172 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

