రికార్డు ధరకు చేరిన బంగారం
శ్రావణమాసం ప్రారంభమైంది ఇక వివాహాలు, పండుగల హడావిడి మొదలు కాబోతోంది. దీనితో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. బంగారం ఈమధ్య కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పుడు రెట్టించిన వేగంతో 60 వేల పైచిలుకు ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ధర 120 రూపాయలు పెరిగింది. దీనితో 55,100 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 60,130 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండిధర స్వల్పగా తగ్గి కిలోకు 81,530 రూపాయలకు చేరుకుంది.


 
							 
							