BusinessHome Page SliderInternationalNews

‘గోల్డ్ కార్డ్’ అంటే ‘గోల్డ్ కార్డే’..

‘రాబిన్ హుడ్’ కంపెనీ రూపొందించిన ఈ గోల్డ్ కార్డ్ సాదాసీదాగా మనం మాట్లాడుకునే గోల్డ్ కార్డ్ కాదు. నిజంగా గోల్డ్‌తో తయారు చేసిందే. దీని బరువు 17 గ్రాములు. దీనిని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసినా, దానిపై 10 క్యారెట్ల గోల్డ్ కోటింగ్ వేయడంతో బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. ఈ కార్డు అమల్లోకి వస్తే తీసుకోవాలని దాదాపు 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. రాబిన్ హుడ్ కంపెనీ స్టాక్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ సహా రిటైల్ బ్రోకరేజ్ సేవలను అందిస్తుంది. దీనిని 2013లో వ్లాదిమిర్ టెనెవ్, బైజు భట్ అనే వ్యక్తులు స్థాపించారు. ఈ గోల్డ్ క్రెడిట్ కార్డు ద్వారా ఏ లావాదేవీలు చేసినా కనీసం 3 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. విదేశీ లావాదేవీలకు కూడా దీనికి ఎలాంటి ఫీజు చెల్లించక్కరలేదు. దీని డిజైన్ చూసి ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ అల్డ్‌మన్ ఫిదా అయిపోయారు. తన ఎక్స్ ఖాతాలో ఈ క్రెడిట్ కార్డ్ ఫోటోను షేర్ చేస్తూ, ‘గోల్డ్ కార్డ్ అంటే మార్కెట్ స్ట్రాటజీ అనుకున్నాను. కానీ నా అభిప్రాయం మార్చుకున్నాను’ అని పేర్కొన్నారు.