Home Page SliderInternational

ఈ దేశాలలో ఉద్యోగానికి వెళ్తే ప్రమాదం

కొన్ని దేశాల నుండి ఉద్యోగం వచ్చిన వారికి జాగ్రత్తపడాలని సూచించింది భారత ప్రభుత్వం. సౌత్‌ ఈస్ట్ ఆసియా, కాంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ వంటి దేశాల నుండి ఉద్యోగం ఆఫర్ వస్తే బాగా పరిశోధించి వెళ్లాలని పేర్కొన్నారు. 2022 సంవత్సరం నుండి ఈ దేశాలకు వెళ్లిన వారి ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. దాదాపు 30 వేల మంది జాడ లేకుండా పోయిందన్నారు. కొందరిని ఉద్యోగాల పేరుతో రప్పించి వీరితో బలవంతంగా సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నారని సమాచారం వస్తోందని పేర్కొన్నారు.  ఈ ఘటనలపై విచారణ కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమించింది.