గోదారమ్మ ఉగ్రరూపం..ముంపులో లంక గ్రామాలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ వరద ఉధృతికి లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. పలు చోట్ వంతెనలపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి జిల్లాలలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి, నదులు పొంగి పొర్లుతున్నాయి. పి. గన్నవరంలో చాకలిపాలెం, కన కాయలంక కాజ్వే మునక వంటి గ్రామాలు ముంపుకు గురయ్యాయి. కోనసీమ- భీమవరం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం, కాళేశ్వరం వద్ద కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ జిల్లాలలకు ఎగువ నుండి వచ్చే వరద నీటితో గోదావరికి వరద పోటెత్తింది.