NationalNews

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కాశ్మీర్ ఫైల్స్ మూవీపై దుమారం

‘ది కాశ్మీర్ ఫైల్స్’ అసభ్యంగా ఉందంటూ ఫెస్టివల్ జ్యూరీ హెడ్ రోజ్ ఫెస్టివల్‌లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ మూవీతో ఆందోళన, షాక్‌ కలిగిందని ఇజ్రాయెలీ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ అన్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జ్యూరీ బోర్డు ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తేల్చి చెప్పింది. ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో జ్యూరీ అధిపతి, ఇజ్రాయెల్ చిత్రనిర్మాత నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో కళాత్మక, పోటీ విభాగానికి ఇది తగని ప్రచార చిత్రంగా మాకు అనిపించిందంటూ నాదవ్ లాపిడ్ కామెంట్ చేశారు. అయినప్పటికీ మనసులోని భావాలను వేదికపై బహిరంగంగా పంచుకోవడానికి ఇష్టపడతానన్నారు. ఇలా మాట్లాడటం ద్వారా చలనచిత్రోత్సవ పండుగ స్ఫూర్తిని కూడా అంగీకరించడమవుతుందన్నారు. విమర్శనాత్మక చర్చకు, కళకు, జీవితానికి అవసరమని చెప్పుకొచ్చాడు. వివేక్ అగ్నిహోత్రి రచించి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’, 90వ దశకంలో తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో లోయ నుండి కాశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించింది.

అయితే మతపరమైన సెంటిమెంట్‌లను పెంచిందనే ఆరోపణలను ఎదుర్కొంది. ఐతే ఫిల్మ్ ఫెస్టివల్‌లో లాపిడ్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నాడు కశ్మీర్ లోయలో భయానక పరిస్థితులను ఎదుర్కొన్న సంఘంలో భాగమైనప్పటికీ, కాశ్మీరీ పండిట్ల బాధలను ఫోకస్ చేయడం సమంజసమేనన్న అభిప్రాయాన్ని వ్కక్తం చేశారు. వివాదం పెరుగుతున్న నేపథ్యంలో IFFI జ్యూరీ బోర్డు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. లాపిడ్ సినిమా గురించి ఏది చెప్పినా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, బోర్డుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. డైరెక్టర్‌కు జ్యూరీ బోర్డు అధికారిక ప్రదర్శనలో 4 జ్యూరీలు హాజరై, ప్రెస్‌తో సంభాషించారని… అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో… ఇష్టాలు లేదా అయిష్టాల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదని బోర్డు స్పష్టం చేసింది. ఈవెంట్ జ్యూరీగా సినిమా సాంకేతిక, సౌందర్య నాణ్యత, సామాజిక-సాంస్కృతిక ఔచిత్యాన్ని అంచనా వేయడం మాత్రమే మా పని అని బోర్డు తేల్చి చెప్పింది. ఏ సినిమాపైనా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యల చేయడానికి అస్కారం లేదంది. ఒకవేళ అలాంటి కామెంట్స్ చేస్తే అవి వారి వ్యక్తిగతమని ప్రకటనలో పేర్కొంది.

ఇజ్రాయెల్ చిత్రనిర్మాతపై విమర్శలు గుప్పించిన వారిలో భారత్‌లో ఆ దేశ రాయబారి నౌర్ గిలోన్ కూడా ఉన్నారు. ట్విట్టర్ థ్రెడ్‌లో, మిస్టర్ లాపిడ్ “సిగ్గుపడాలి” అని అన్నారు. “మీరు @IFFIGoaలో న్యాయమూర్తుల ప్యానెల్‌కు అధ్యక్షత వహించే భారతీయ ఆహ్వానాన్ని… మీ పట్ల ఉన్న విశ్వాసం, గౌరవం, ఆతిథ్యాన్ని అత్యంత దారుణంగా దుర్వినియోగం చేసారంటూ మండిపడ్డారు. ఒక చలనచిత్ర నిపుణుడిని కాను, కానీ చారిత్రాత్మక సంఘటనలను లోతుగా అధ్యయనం చేసే ముందు వాటి గురించి మాట్లాడటం అసంబద్ధం, దురభిమానం అని తెలుసన్నారు ఇండియాలో ఇజ్రాయెల్ రాయాబారి. భారతదేశంలో ఈ మొత్తం వ్యవహారం అనవసర రచ్చకు దారితీస్తోందని… రాయబారి చెప్పారు. సినిమాలో కథానాయకుడిగా నటించిన నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఇజ్రాయెల్ చిత్రనిర్మాతపై మండిపడ్డారు. “భగవంతుడు అతనికి జ్ఞానం ప్రసాదిస్తాడు. హోలోకాస్ట్ సరైనదైతే, కాశ్మీరీ పండిట్ల వలస కూడా సరైనదే” అని నటుడు చెప్పాడు.