Home Page SliderInternationalmovies

విశ్వక్‌సేన్ చిత్రానికి గ్లోబల్ గుర్తింపు..

గత ఏడాది విడుదలైన హీరో విశ్వక్‌సేన్ నటించిన ‘గామి’ చిత్రానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించింది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డామ్‌ వేడుకలలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అలాగే సౌత్ ఇండియా నుండి విక్రమ్ నటించిన తమిళమూవీ తంగలాన్ కూడా ఎంపికయ్యింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 9 వరకూ జరగనుంది. విశ్వక్ సేన్, చాందినీ చౌదరి నటించిన ఈ చిత్రం ఆరేళ్లపాటు హిమాలయాలలో చిత్రీకరణ జరుపుకుంది. ఇందులో విశ్వక్ సేన్ ‘అఘోరా’గా నటించారు. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ఎక్కువ సాధించకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.