Home Page SliderNational

‘సరిపోదా శనివారం’ గ్లింప్స్.. మరోసారి భయపెట్టిన ఎస్‌జే సూర్య

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నేచురల్ స్టార్ నాని. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టిన నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆగస్టు 29న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో తమిళ డైరెక్టర్, నటుడు ఎస్‌జే సూర్య విలన్‌  పాత్రలో నటిస్తుండటం విశేషం. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్.

నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చి మొదటి గ్లింప్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో వివేక్ ఆత్రేయతో నాని చేసిన ‘అంటే సుందరానికి’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీంతో మరోసారి అదే డైరెక్టర్‌తో డిఫరెంట్ సినిమా చేస్తున్నారు నాని. ఈ సినిమాలో తమిళ డైరెక్టర్, నటుడు ఎస్‌జే సూర్య విలన్‌ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్‌జే సూర్య పుట్టినరోజు కావడంతో మూవీ టీమ్‌  ఆయన పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇందులో మరోసారి తన నటనతో భయపెట్టారు సూర్య.

నరకాసురుడిగా సూర్య: ప్రజలను ఇబ్బంది పెడుతూ రాక్షాసానందం పొందే నరాకాసురుడి లాంటి పోలీస్‌ను సత్యభామ (హీరోయిన్) సాయంతో కృష్ణుడు (నాని) వధించడమే ఈ స్టోరీ అంటూ సింపుల్‌గా గ్లింప్స్‌లో చెప్పేశారు. ఇక ఇందులో ఎస్‌జే సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు.

నాని- ప్రియాంక మోహన్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆగస్ట్ 29న విడుదల కానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి.. ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో ప్రియాంక-నాని కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.