Home Page SliderTelangana

నీ భార్యను నాకిచ్చెయ్.. సంతోషంగా ఉంటాం..

‘నీ భార్యను నాకిచ్చెయ్.. నాతో పంపించు జీవితాంతం సంతోషంగా ఉండేలా మీ ఆవిడ్ని నేను చూసుకుంటా అంటూ ప్రియురాలి భర్తతో గొడవకు దిగిన ఓ వ్యక్తి వారి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరు దంపతులు సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చి, యూసుఫ్ గూడ పరిధిలో నివాసం ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పని చేస్తున్నారు. వీరి సమీప గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సూర్య నారాయణ కొన్నేళ్ళ క్రితం పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సూర్యనారాయణ ‘మీ ఆవిడ అంటే నాకు ప్రాణం.. నాకిచ్చెయ్..’ అంటూ ఆమె భర్తతో గొడవకు దిగాడు. ఆ రాత్రి ఇంటి బయటే నిద్రించిన అతను తెల్లవారు జామున పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మధురా నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.