Home Page SliderNational

అధికారం ఇవ్వండి.. మసీదుపై లౌడ్ స్పీకర్ లేకుండా చేస్తాం..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడి వేడిగా కొనసాగుతున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహా రాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇవాళ అమరావతిలో ఎన్నికల ప్రచారంలో రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మాకు అధికారం ఇవ్వండి, మహారాష్ట్రలోని ఏ మసీదుపైనా ఒక్క లౌడ్ స్పీకర్ కూడా లేకుండా చూసుకుంటామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ముస్లిం నాయకులు మహా వికాస్ అఘాడి కూటమికి ఓట్లు వేయాలని మసీదుల నుండి ఫత్వాలు జారీ చేస్తున్నారని రాజ్ థాక్రే ఆరోపించారు. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మసీదు లౌడ్ స్పీకర్లను బలవంతంగా తొలగించారని గుర్తు చేశారు.