Home Page SliderTelangana

నాకు ఇప్పటికైనా న్యాయం చేయండి.. కాంగ్రెస్ సీనియర్ నేత

తనకు పార్టీలో అన్యాయం జరిగిందని వాపోయాడు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. తనకు ఎంపీ టికెట్ల విషయంలో న్యాయం చేయలేదన్నారు. నాకు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఇస్తే తాను గెలిచేవాడినని, ఆ సీటు ఇప్పుడు బీజేపీ రాబట్టుకుందని పేర్కొన్నాడు. ఇప్పటికైనా రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో క్రీడలకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తే వాటికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. సీనియర్లకు పార్టీలో గౌరవం తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు వీహెచ్.