నాకు 4 నెలల టైం ఇవ్వండి..మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తనకు 3,4 నెలల సమయం ఇవ్వాలని అప్పటి వరకూ దీక్షను విరమించాలని వైద్యులను కోరారు. ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచార ఘటనలో న్యాయం చేకూర్చాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని జూనియర్ వైద్యులు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షను వీడాలని ఆమె వారిని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే వైద్య సేవలపై దాని ప్రభావం ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చర్చలకు రావాలని జూనియర్ వైద్యులకు సూచించారు.