‘పుష్ప-2కి లీవ్ ఇవ్వండి’..స్టూడెంట్ లెటర్ వైరల్
తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప-2’కి వెళ్లాలి, నాకు లీవ్ కావాలని ఒక విద్యార్థి నిజాయితీగా రాసిన లీవ్ లెటర్ వైరల్ అవుతోంది. ‘పుష్ప-2’ చిత్రం మేనియా యువతను ఊపేస్తోంది. ఇలాగే ఆ సినిమాను వెంటనే చూసేయాలని పిల్లలు ఉబలాటపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఇలాగే ఒక విద్యార్థి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకున్నాడు. కానీ స్కూల్ ఉంది. స్కూల్‌కి లీవ్ పెట్టాలని, ప్రిన్సిపల్‌కి లీవ్ లెటర్ రాశాడు. ధైర్యంగా లెటర్ రాస్తూ, పుష్ప చిత్రానికి వెళ్లడానికి లీవ్ ఇవ్వమని అడిగాడు. టీచర్ ఆ విద్యార్థి నిజాయితీకి మెచ్చుకుని, ఆ లెటర్ని మురిపెంగా తన వాట్సాప్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

