Home Page SliderNational

బ్రేకప్ కు నో చెప్పాడని ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరి శిక్ష

కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాయ్ ఫ్రెండ్ ను చంపిన కేసులో యువతి గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది. ఆమెకు సహకరించిన బంధువు నిర్మలా సీతారామన్ నాయర్ కి సైతం మూడేండ్ల జైలు శిక్ష వేసింది. ఈ కేసులో గత వారం యువతిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఆ మేరకు ఉరి శిక్షను ఖరారు చేసింది. రేడియోలాజీ స్టూడెంట్ షారోన్ రాజ్ అనే యువకుడితో చాలా కాలంగా ప్రేమాయణం కొనసాగించింది. అయితే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు మరో సంపన్న వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో షారోన్ రాజ్ పీడను వదులుకోవాలని నిందితురాలు గ్రీష్మ..ప్లాన్ ప్రకారం తన బాయ్ ఫ్రెండ్ షారోన్ రాజ్ కు కూల్ డ్రింక్ లో విషం కలిపి హత్య చేసింది.