Andhra PradeshNews

బెజవాడ దుర్గమ్మకు 3స్వర్ణకిరీటాలు కానుక

విజయవాడ కనకదుర్గమ్మకు దేశం నలుమూలలా భక్తులు ఉన్నారు. చేతనయినంతలో కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. నవీ ముంబయి రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన జి.హరికృష్ణా రెడ్డి దంపతులు అమ్మవారికి మూడు స్వర్ణ కిరీటాలను తయారుచేయించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కిరీటాలను కనకదుర్గమ్మ ఉత్సవ విగ్రహ అలంకరణ కోసం సుమారు 1,308 గ్రాముల బరువు కలిగి ఉన్నాయి. ఈ బంగారు కిరీటాలను ఈవోకు అందజేశారు. దర్శనానంతరం దాత కుటుంబానికి ప్రధానార్చకులతో వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం వారికి ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు. దుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. త్వరలో రాబోయే ఈ శరన్నవరాత్రులలో ఈ కిరీటాలను అమ్మవారికి అలంకరిస్తారు.