Home Page SliderPoliticsTelanganaTrending Today

జీహెచ్‌ఎమ్‌సీ సమావేశం ఉద్రిక్తత..

నేడు జరుగుతున్న జీహెచ్‌ఎమ్‌సీ సర్వసభ్య  సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మేయర్ విజయలక్ష్మి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం తెలిపే విషయంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులతో నిరసనలు తెలియజేశారు. మేయర్ పోడియాన్ని ముట్టడించడానికి ప్రయత్నించగా, వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీనితో ఈ రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై మండిపడ్డ మేయర్ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను సమావేశం నుండి సస్పెండ్ చేశారు. సభ్యులను మార్షల్స్ బయటకు తీసుకువెళ్లారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనితో చర్చలు లేకుండానే బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది.