నేడు GHMC స్థాయీ సంఘం సమావేశం
HYD: GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘం సమావేశం జరగనున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 11 అంశాలకు సంబంధించి.. అన్ని పార్టీల సభ్యులు చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపనున్నారు. GHMC లోని వివిధ శాఖల అధికారులు, సభ్యులు ఈ భేటీకి హాజరవుతారు.

