BusinessHome Page SliderNews AlertTelangana

తాజ్ హోటల్‌కు జీహెచ్‌ఎంసీ షాక్

ప్రపంచ ప్రసిద్ధమైన తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కి హైదరాబాద్‌లో షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ఈ హోటల్‌ పన్నులు చెల్లించడం లేదని, పలుమార్లు నోటీసులు జారీ చేసినా, స్పందించలేదని అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు రూ. 1 కోటి 40 లక్షల పన్నులు బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారు. పన్ను చెల్లింపులకు చాలా సార్లు గడువు ఇచ్చారని, కానీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని, అందుకే ఈ చర్యలు తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు.