జీహెచ్‌ఎంసీ సరికొత్త నిర్ణయం..వాటిపై నిషేధం
హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ కొత్త నిర్ణయం తీసుకుంది. నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లపై నిషేధం విధించింది. అంతేకాక వాల్ పోస్టర్లు, అనవసర రాతలను కూడా నిషేధిస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఈ నియమాలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు.

