Home Page SliderTelangana

వాడివేడీగా సాగిన GHMC కౌన్సిల్ సమావేశం

ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన GHMC కౌన్సిల్ సమావేశం రసాభసగా కొనసాగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్‌తోపాటు, జిల్లా కమిషనర్స్,కాంగ్రెస్,బీఆర్ఎస్ కార్పోరేటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై కౌన్సిల్ సభ్యులు చర్చ ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ కార్పోరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ..మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారంతా మేయర్ పోడియంని చుట్టుముట్టారు. దీంతో మేయర్ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా బీఆర్ఎస్ కార్పోరేటర్లు కౌన్సిల్ సమావేశం జరగకుండా అడ్డుకున్నారు.