ఘజియాబాద్‌లో దారుణం – యువకుడిని రాడ్లతో కొట్టి చంపిన బాలిక తండ్రి
ఘజియాబాద్‌లో 23 ఏళ్ల యువకుడిని అతి దారుణంగా ఐరన్ రాడ్లతో కొట్టి చంపారు ఒక బాలిక తండ్రి, అతని ఇంటి పొరుగువారు. మైనర్ యువతిని కలవడానికి వచ్చాడనే కోపంతో పర్వేజ్ అనే యువకుడిపై దాడి చేశారు. దిల్లీకి చెందిన వెల్డర్ పని చేసుకునే పర్వేజ్ వేరే కులానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఒకరినొకరు ఇష్టపడ్డారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పర్వేజ్ తన కుమార్తెతో మాట్లాడడం చూసిన ఆవ్యక్తి ఆగ్రహం పట్టలేకపోయాడు. ఇంటి పొరుగున ఉన్న అమన్, రంజిత్ అనే ఇద్దరు యువకులను పిలిచి వారిద్దరి సహాయంతో ఇనుప రాడ్లతో పర్వేజ్‌పై దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేక అతడు మరణించాడు. పర్వేజ్ తమ్ముడు సమీర్, పర్వేజ్ గురువారం సాయంత్రం 5 గంటలకు రక్షించమని, వారు చంపేస్తున్నారని ఫొన్ చేశాడని తెలియజేశాడు. పర్వేజ్ కుటుంబం ఇచ్చిన కంప్లైంటు ప్రకారం పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, బాలిక తండ్రిని, అతనికి సహాయపడిన రంజిత్, అమన్‌ను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

