ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి..
‘బీఆర్ఎస్ పార్టీ సైనికులారా.. బై ఎలక్షన్లకు సిద్ధంగా ఉండండి’ అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. పార్టీ ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించా రు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమని పేర్కొన్నారు. అయితే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.