Home Page SliderTelangana

ఆర్టీసీ కండక్టర్ ఔదార్యం..బస్సులో మహిళకు డెలివరీ

తెలంగాణ ఆర్టీసీ బస్సులో తాజాగా ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఆర్టీసీ మహిళా కండక్టర్ ఔదార్యంతో ఆమెకు పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. శ్వేతారత్నం అనే గర్భిణీ మహిళ హైదరాబాద్‌ ఆరాంఘర్ వద్ద బస్సు ఎక్కారు. బహదూర్ పుర వద్దకు రాగానే నొప్పులు మొదలు కావడంతో బస్సులో అందరూ కంగారుపడ్డారు. దీనితో సమయస్ఫూర్తితో వ్యవహరించిన కండక్టర్ సరోజ తోటి మహిళా ప్రయాణికుల సహాయంతో ఆమెకు బస్సులోనే ప్రసవం చేశారు. ఆమెకు పండంటి ఆడపిల్ల పుట్టింది. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సమాచారం. ధైర్యం చేసి డెలివరీ చేసిన కండక్టర్ సరోజను అందరూ అభినందిస్తున్నారు.