తెలంగాణా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్
తెలంగాణా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు. కాగా సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర BRSV అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గెల్లు శ్రీనివాస్ గతంలో హుజూరాబాద్ ఎన్నికలలో బీఆర్‌ఎస్ తరుపున పోటి చేశారు. అయితే ఆయన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో పరాజయం పాలయ్యారు. త్వరలోనే గెల్లు శ్రీనివాస్ తెలంగాణా టూరిజం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

